శ్రీవిశ్వ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

శ్రీవిశ్వ ప్రభంజనం

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

సీతంపేట: ఇంటర్‌ ఫలితాల్లో శ్రీవిశ్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జూనియర్‌ ఎంపీసీలో 470 మార్కులకు గాను ముచ్చర్ల దీపికా గౌరి 467 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. యెన్ను కుసుమ, పెంట బాలకృష్ణ, బోడ శ్రీవెంకట ఆశిష్‌, బొడ్డేటి శశిన్‌, సనపల సత్యతేజ, బోకం దీప్తి లోచన, సుతపల్లి శశివదన్‌, పోతల భానుప్రసాద్‌, మేడవాల శ్రీహన్సిక, యాళ్ల సంశ్రిత, గార కుందన ప్రియలు తలా 466 మార్కులు సాధించారు. బైపీసీలో 455 మార్కులకు గాను మేడపాటి నేహారెడ్డి 451 మార్కులు, గొల్లవిల్లి తేజ శ్రీ 447, నమ్మి సౌజన్య 446, దాడి స్ఫూర్తి వెంకట తేజస్విని 444 మార్కులు సాధించారు. సీనియర్‌ ఎంపీసీలో జి.కృష్ణ లహరి 991 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. దుంప గోపీచంద్‌ (990), గర్నిపూడి శ్రీసత్యసాయి ప్రవల్లిక (990), ఉమ్మెత్తల శ్రీలయ (989), కొత్తకోట భార్గవి(989) మార్కులు సాధించారు. బైపీసీలో మేకా లక్ష్మీప్రసన్న 989 మార్కులు సాధించి సత్తా చాటింది. విద్యార్థులను చైర్మన్‌ కె.ఎస్‌.హెచ్‌.ఆర్‌.కె.ధర్మరాజు, డైరెక్టర్‌ పి.సూర్యనారాయణ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement