మద్దిలపాలెం: ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు హవా కొనసాగించారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో టి.మాధురి 468, జి.తనూశ్రీ 467, పి.శృతిహాసన్ 467, వి.ఈశ్వర సంజాయ్ 467, మరో ఆరుగురు 467 మార్కులు సాధించారు. 467 పైగా ఏడుగురు, 466 పైగా 24 మంది, 460పైగా 847 మంది, 450 పైగా 2,175 మంది, 425 పైగా మార్కులు 4,515 మంది ఉత్తీర్ణత సాధించారు. బైపీసీ ఫస్ట్ ఇయర్‌లో 450పైగా 11 మంది, 445పైగా 74 మంది, 420పైగా 308 మంది, 410పైగా 374 మంది, 400పైగా మార్కులు 427 మంది సాధించారు. ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో 480పైగా ఇద్దరు, 450పైగా మార్కులు 12 మంది సాధించారు. సెకండియర్ ఎంపీసీలో 991పైగా 14 మంది, 985 పైగా 262, 980పైగా 611, 970పైగా 1333, 950పైగా 1868, 900పైగా మార్కులు 5,374 మంది సాధించారు. బైపీసీ సెకండియర్‌లో పి.యామిని 990, తేజేశ్వని 990 మార్కులు సాధించారు. 980 పైగా 122 మంది, 975పైగా 192 మంది, 970పైగా 262 మంది, 960 పైగా 420 మంది, 950పైగా 542 మంది, 900పైగా మార్కులు 861 మంది సాధించారు.


