‘పూడి శ్రీహరి అరెస్ట్‌ పాశవిక చర్య’ | - | Sakshi
Sakshi News home page

‘పూడి శ్రీహరి అరెస్ట్‌ పాశవిక చర్య’

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

ఆరిలోవ: వైఎస్సార్‌సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్‌ పాశవిక చర్య అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లంపల్లి రాజబాబు బుధవారం ప్రకటనలో విమర్శించారు. ఈ చర్యను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ తరఫున ఖండిస్తున్నామన్నారు. మాజీ ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జువ్వలదిన్నె షిప్పింగ్‌ హార్బర్‌ పర్యటన నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం శ్రీహరిని అరెస్ట్‌ చేయించిందని ఆయన ఆరోపించారు. ఎల్లకాలం ఈ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడపలేరన్న సంగతి గుర్తించుకోవాలన్నారు. ఇప్పటికే రెడ్‌బుక్‌ రాజ్యాంగం, కుట్రలతో కూడిన చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని, ఇది మంచిది కాదని హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement