తాటిచెట్లపాలెం: ఇంటర్ ఫలితాల్లో నరసింహనగర్‌లో ఉన్న వీశ్రేష్ట సంస్థ అద్భుత విజయాన్ని సాధించింది. విద్యార్థిని విజ్ఞత (హెచ్‌ఈసీ) 500 మార్కులకు గాను 491 మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచింది. హెచ్‌ఈసీలో మొత్తం 20 మంది విద్యార్థులు 470కు పైగా మార్కులు సాధించారు. ఎంపీసీలో 465 మార్కులు, ఎంఈసీలో కార్తికేయ 493 మార్కులు సాధించడం గమనార్హం. మొత్తం విద్యార్థుల్లో 98 శాతం మంది 450కు పైగా మార్కులు సాధించడం సంస్థ విజయాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ అద్భుత ఫలితాల సాధనలో భాగస్వాములైన అధ్యాపకులు, తల్లిదండ్రులను సంస్థ డైరెక్టర్ నర్దనా మోహన్ అభినందించారు.


