డాబాగార్డెన్స్ : ఇంటర్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని మాస్టర్ మైండ్స్ విశాఖ బ్రాంచ్ అడ్మిన్ ప్రిన్సిపాల్ చల్లా అంజిరెడ్డి, అకడమిక్ ప్రిన్సిపాల్ దినేష్ తెలిపారు. ఎంఈసీ జూనియర్ ఫలితాల్లో ఆర్.శైలజ అన్నపూర్ణ 495, ఎల్.ఝాన్సీశ్రీ 495, జి.రాధిక 494, పి.హేమాన్య 493 మార్కులు సాధించినట్టు చెప్పారు. సీనియర్ ఇంటర్‌లో బి.గీతిక 984, బి.శిల్ప 980 మార్కులు సాధించారని తెలిపారు. ఫస్టియర్‌లో 96 శాతం, సెకండియర్‌లో 92 శాతం ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు.


