తాటిచెట్లపాలెం: వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వయా దువ్వాడ, కొత్తవలస మీదుగా పలు సమ్మర్ స్పెషల్, వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
● చర్లపల్లి–సంత్రగచ్చి(07671) సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 17, 20, 24, 27, 30వ తేదీల్లో ఉదయం 10.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదే రోజు రాత్రి 10.48 గంటలకు దువ్వాడ, మరుసటిరో జు మధ్యాహ్నం 2.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07672) సంత్రగచ్చిలో ఈ నెల 18, 21, 25, 28, మే 1వ తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 10 గంటలకు చర్లపల్లి చేరుకుంటాయి.
● చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ(07165) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20న సాయంత్రం 6.10 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు దువ్వాడ, అదే రోజు సాయంత్రం 5.20 గంటలకు భువనేశ్వర్ న్యూ చేరుకుంటుంది.
● మైసూరు–డిబ్రూగడ్(06253) సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26న ఉదయం 8 గంటలకు మైసూరులో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.28 గంటలకు కొత్తవలస, బుధవారం తెల్లవారు 1.30 గంటకు డి బ్రూఘడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06254) డిబ్రూఘడ్‌లో ఈ నెల 16, 30వ తేదీలలో తెల్లవారు 1.30 గంటలకు బయల్దేరి ముసటి రోజు రాత్రి 7.38 గంటలకు కొత్తవలస, శనివారం సా యంత్రం 4.15 గంటలకు మైసూరు చేరుకుంటాయి.
● యశ్వంత్‌పూర్–న్యూ జల్పయ్‌గురి(06567) సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 17, 24వ తేదీల్లో ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.28 గంటలకు కొత్తవలస, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు న్యూ జల్పయ్‌గురి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06568) ఈ నెల 20, 27వ తేదీల్లో ఉదయం 8.30 గంటలకు న్యూ జల్పయ్‌గురిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.13 గంటలకు కొత్తవలస, బుధవారం ఉదయం 9.55 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటాయి.
● ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(06073) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్‌లో ఈ నెల 20, 27వ తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2.53 గంటలకు దువ్వాడ, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06074) ఈ నెల 22, 29 తేదీల్లో ఉదయం 10.45 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.03 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 7.30 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్‌కు చేరుకుంటాయి.
● తాంబరం–సంత్రగచ్చి(06075) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21, 28వ తేదీలలో తాంబచంలో ఉదయం 10.15 గంటలకు బయల్దేరి అదేరోజు అర్ధరాత్రి 1.58 గంటలకు దువ్వాడ, బుధవారాల్లో సాయంత్రం 6.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06076) ఈ నెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 4 గంటలకు దువ్వాడ, శుక్రవారాల్లో ఉదయం 10.30 గంటలకు తాంబరం చేరుకుంటాయి.
● ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(06067) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్‌లో ఈ నెల 16న ఉదయం 6.55 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7 గంటలకు దువ్వాడ, శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06068) ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.38 గంటలకు దువ్వాడ, అదే రోజు రాత్రి 6.30 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
యశ్వంత్‌పూర్ స్పెషల్‌కు దువ్వాడ, కొత్తవలసలో హాల్ట్
యశ్వంత్‌పూర్–కతిహార్–యశ్వంత్‌పూర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు దువ్వాడ, కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, పలాసలలో అదనపు హాల్ట్‌ను కల్పిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్‌కుమార్ తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల జాబితాను తగ్గించేందుకు ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్(06077/78) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు 1–స్లీపర్ క్లాస్ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నట్లు పేర్కొన్నారు.


