మద్దిలపాలెం : ఇంటర్ ఫలితాల్లో ఎసెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 99.03 శాతం, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 98.45 శాతం ఫలితాలు సాధించారు. ఎంపీసీ ప్రథమ సంవత్పరంలో 466/470 మార్కులు బూసిన ప్రజ్నా, గంటా హేమంత్ కుమార్‌లు సాధించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 988/1000 వావిలపల్లి నిఖిత, సాయి సంతోష్ తనుష్ కోనా, గొల్లా దేవకి ప్రియ, బూర్జా షణ్ముఖ సాయిరాంలు సాధించారు. కళాశాల నుంచి ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 1,032 మంది ఉత్తీర్ణత సాధించగా.. 64 మంది 98 శాతం, 343 మంది 95 శాతం, 599 మంది 90 శాతం పైగా మార్కులు సాధించారు. 869 మంది ఏ గ్రేడ్‌లో సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 808 మంది ఉత్తీర్ణత సాధించగా 24 మంది 98 శాతం, 184 మంది 95 శాతం, 387 మంది 90 శాతం పైగా స్కోర్ సాధించారు. 702 మంది ఏ గ్రేడ్ మార్కులు సాధించారని కళాశాల అకడమిక్ డైరెక్టర్ జి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు, గౌరినాయుడు తెలిపారు.


