‘అలెన్‌ షార్ప్‌’ విజేతలకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

‘అలెన్‌ షార్ప్‌’ విజేతలకు సత్కారం

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

విశాఖ సిటీ: అలెన్‌ కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ‘అలెన్‌ షార్ప్‌’ స్కాలర్‌షిప్‌ విజేతల సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. గత ఏడాది నవంబర్‌ 22న నిర్వహించిన స్కాలర్‌షిప్‌ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 10వ తరగతి వరకు గల సుమారు 270 మంది విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. వారి ర్యాంకుల ఆధారంగా రూ.వెయ్యి నుంచి రూ.21 వేల వరకు నగదు పురస్కారాలతో విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా అలెన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సౌత్‌ డివిజన్‌ హెడ్‌ మహేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. విశాఖ నగరం విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, ఎన్‌ఏడీ జంక్షన్‌, వెంకోజీపాలెంలో ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము కేవలం ఫలితాలే కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, బలమైన పునాదులు నిర్మించడంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. అలెన్‌ ఆంధ్రప్రదేశ్‌ అకడమిక్‌ హెడ్‌ సీతారాం నందూరి మాట్లాడుతూ క్రమశిక్షణ, నిరంతర కృషితోనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘టాపర్స్‌ టాక్‌ షో విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. అలెన్‌ పూర్వ విద్యార్థులు, జాతీయ స్థాయి ర్యాంకర్లు చిన్మయ శంకర్‌ శాస్త్రి, ఏకాంత్‌ టి.సంజయ్‌ తమ విజయ ప్రస్థానాన్ని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement