డాబాగార్డెన్స్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక మంగళవారం విశాఖలో నిర్వహించారు. నగరంలోని స్వామి వివేకానంద స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ ఎన్నికకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నాయకులు హాజరయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన అన్వర్ బాషాను, రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన పర్వతరెడ్డి కిషోర్‌బాబును, ప్రధాన కార్యదర్శిగా విశాఖకు చెందిన బీవీ మురళీ మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే అదనపు ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన గోపాల్‌రెడ్డి, కోశాధికారిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం.రాజు, గౌరవ అధ్యక్షురాలిగా కాకినాడ జిల్లాకు చెందిన పి.వసంత, సహాయ కార్యదర్శిగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సీహెచ్‌వీఆర్ మూర్తి, ఉత్తరాంధ్ర రీజియన్ అధ్యక్షుడిగా జీఎస్ నాయుడును ఎన్నికయ్యారు. అలాగే ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు కొణతాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


