‘భారత్‌ గౌరవ్‌’ పర్యాటక రైలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘భారత్‌ గౌరవ్‌’ పర్యాటక రైలు ప్రారంభం

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

బీచ్‌రోడ్‌: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే ‘భారత్‌ గౌరవ్‌’ పర్యాటక రైలును విశాఖపట్నం నుంచి తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ జనరల్‌ మేనేజర్‌ డి.ఎస్‌.జి.పి కిశోర్‌ తెలిపారు. సోమవారం రామనగర్‌లోని హోటల్‌ ఎలైట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ‘అరుణాచలం–కాంచీపురం–మహాబలిపురం దివ్య దక్షిణ యాత్ర’ పేరిట రూపొందించిన ఈ ప్యాకేజీ కింద ప్రత్యేక రైలు ఈ నెల 27న విశాఖ నుంచి బయలుదేరి మే 4 వరకు ప్రయాణిస్తుంది. మొత్తం 8 రాత్రులు, 9 రోజులపాటు సాగే ఈ యాత్రలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు, వారసత్వ ప్రదేశాలు సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. యాత్రికులకు రవాణా, వసతి, భోజన సదుపాయాలతో పాటు టూర్‌ ఎస్కార్ట్‌ సేవలు అందిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement