వేతనాలు పెంచాలని మెప్మా ఆర్పీల నిరసన | - | Sakshi
Sakshi News home page

వేతనాలు పెంచాలని మెప్మా ఆర్పీల నిరసన

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

బీచ్‌రోడ్‌: ఏపీ మెప్మా ఆర్పీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆర్పీలు నిరసన తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. పనిభారం తగ్గించాలని, అనవసరమైన యాప్‌లను రద్దు చేయాలని వారు కోరారు. విజయనగరంలో విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్పీ జయలక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు..ఆర్పీల వేతనాలు పెంచాలని, ఆ మొత్తాన్ని నేరుగా వ్యక్తిగత ఖాతాల్లోనే జమ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పి. మణి, ఎస్‌. లక్ష్మి, ఝాన్సీ, సత్య వరలక్ష్మి, జిల్లా ముఖ్య నాయకులు సుధా, వందన, మల్లీశ్వరి లత, దేవి, ధనలక్ష్మి, త్రివేణి, సుశీల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement