ఇప్పటికే వోటీపీ, బుకింగ్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలపై ‘ఈకేవైసీ’ నిబంధనను ఏజెన్సీలు అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. అక్రమంగా జరిగిన విక్రయాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఈకేవైసీ పేరుతో లేనిపోని కొర్రీలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా సర్వర్లు పనిచేయవనే సాకుతో వినియోగదారులను ముప్పుతిప్పులు పెడుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఈ ప్రక్రియ, ఇప్పుడు బ్లాక్ మార్కెట్ దందాను ప్రశ్నించకుండా ఉండేందుకు ఒక బూచీగా మారింది. యుద్ధం పేరు చెప్పి దోచుకుంటున్న ఈ గ్యాస్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకపోతే, సామాన్యుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


