చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

సింహాచలం: ఈనెల 20న జరగనున్న చందనోత్సవంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను సోమవారం ఆమె జేసీ విద్యాదరి, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చితో కలిసి పరిశీలించారు. ఈ ఏడాది 2 లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేశామని తెలిపారు. టైంస్లాట్‌లు ఇచ్చామని, వాటిలో ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 20వ తెల్లవారుజామున 3 గంటల నుంచే సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉదయం 5 గంటల లోపే నిర్దేశించిన వీఐపీలకు అంతరాలయ దర్శనం ఉంటుందని, ఆ తర్వాత ఎవరొచ్చినా ఉండదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement