జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 102 వినతులు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 102 వినతులు

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 102 వినతులు అందాయి. కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్‌ వర్మలతో కలిసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అందిన వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 56 రాగా, ఇంజినీరింగ్‌కు 14, అడ్మినిస్ట్రేషన్‌కు 15, రెవెన్యూకు 8 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ అధికారులు ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జోనల్‌ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జోనల్‌ కమిషనర్‌ నెలకు కనీసం 10 సచివాలయాలను సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ పి.నల్లనయ్య, జాయింట్‌ డైరెక్టర్‌(అమృత్‌) డి.విజయభారతి, ప్రధాన ఇంజనీర్‌ పీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌, సీసీపీ ప్రభాకరరావు, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, డిప్యూటీ కమిషనర్‌(రెవెన్యూ) ఎస్‌.శ్రీనివాసరావు, ఏడీహెచ్‌ వాసుకి, స్పోర్ట్స్‌ డైరక్టర్‌ ఈఏ రాజు, ఆర్‌ఎఫ్‌ఓ కృపావరం, సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్‌ ఎల్‌.రవికుమార్‌, పర్యవేక్షక ఇంజినీర్లు, డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement