జ్యోతిరావు పూలేకు నివాళి | - | Sakshi
Sakshi News home page

జ్యోతిరావు పూలేకు నివాళి

Apr 12 2026 2:54 AM | Updated on Apr 12 2026 2:54 AM

మహారాణిపేట: మహాత్మా జ్యోతిరావు పూలేకు రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌ రాజు, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఘనంగా నివాళుర్పించారు. పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌ మీటింగు హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, బీసీ వెల్పేర్‌ అధికారిణి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలేకు కలెక్టర్‌ నివాళి

డాబాగార్డెన్స్‌: జడ్జికోర్టు కాంప్లెక్స్‌ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్‌ పీఎస్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement