గాజువాక: ఆటోనగర్‌లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సు దగ్ధమైంది. ఆటోనగర్ ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరిపురానికి చెందిన వినీత టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సు సర్వీసింగ్ కోసం ఆటోనగర్‌కు వెళ్తోంది. ఐలా జంక్షన్‌కు వచ్చేసరికి బస్సు ఇంజన్‌లో నుంచి పొగ రావడం మొదలైంది. ఇంతలోనే మంటలు రావడం ప్రారంభమయ్యాయి. దీన్ని గమనించిన డ్రైవర్ నాగరాజు బస్సులో నుంచి దిగిపోయి ఆటోనగర్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిని బస్సువద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదమేమీ జరగలేదని బస్ డ్రైవర్ పేర్కొన్నాడు. బస్సు ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారి పేర్కొన్నారు.


