కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

నగర నడిబొడ్డున సుమారు రూ.10 కోట్ల్ల విలువైన 500 గజాల జీవీఎంసీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి, అందులో జిమ్‌ నిర్వహిస్తుంటే కమిషనర్‌కు కనిపించడం లేదా? ఆపరేషన్‌ లంగ్స్‌ పేరు తో 10 గజాల్లో వ్యాపారం చేసుకునే పేదల దుకాణాలను కూల్చేసిన అధికారులకు.. ఈ కబ్జా ఎందుకు కనిపించడం లేదు? గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ 20 వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంక్‌ను ఇక్కడ నిర్మించాను. చుట్టూ ఫెన్సింగ్‌, గ్రీనరీ ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఆ ట్యాంక్‌ పక్కనే అక్రమంగా షెడ్డు వేయడం వల్ల తాగునీటికి, ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉంది. కబ్జాకు పాల్పడిన నాయకుడిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రాగానే, అదే స్థలంలో ప్రజల అవసరాల కోసం మూడు అంతస్తుల భవనం నిర్మిస్తాం. మహిళలు, పురుషులకు వేర్వేరుగా జిమ్‌లు, కల్యాణ మండపం ఏర్పాటు చేస్తాం.

–వాసుపల్లి గణేష్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement