నేటి నుంచి ఆన్‌లైన్‌లో చందనోత్సవం టికెట్లు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆన్‌లైన్‌లో చందనోత్సవం టికెట్లు

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

సింహాచలం: చందనోత్సవం టికెట్లు ఆదివారం నుంచి ఈనెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయని దేవస్థానం ఈవో జె.వెంకటరావు శనివారం తెలిపారు. దేవస్థానం అధికార వెబ్‌సైట్‌ chandanotsavam.ap.gov.inలో రూ.300, రూ.1000 టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సింహాచలం, అక్కయ్యపాలెం యూనియర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లు, సింహాచలం, బిర్లా జంక్షన్‌లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ల్లో రూ.300, రూ.1000 టికెట్లు విక్రయాలు జరుగుతాయని తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో టికెట్ల విక్రయాలు ఉండవని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement