వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పూలే జయంతి
మహారాణిపేట: అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్ కొనియాడారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమర్‌నాథ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, వారి సామాజిక అభ్యున్నతి కోసం పూలే చేసిన పోరాటం మరువలేనిదని గుర్తు చేశారు. కుల వివక్ష నిర్మూలనకు, మహిళా విద్యకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు జహీర్ అహ్మద్, రొంగలి జగన్నాథం, పేడాడ రమణికుమారి, మాజీ డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, పార్టీ నాయకులు జాన్ వెస్లీ, పేర్ల విజయచంద్ర, పల్లా దుర్గారావు, డి. శ్రీనివాస్, పి.వి.సురేష్, సునీల్, అల్లా శంకరరావు, అల్లంపల్లి రాజుబాబు, మారుతి ప్రసాద్, బర్కత్ అలీ, శ్రీదేవి వర్మ, బోని శివరామకృష్ణ, బోండా ఉమామహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, రేయి వెంకటరమణ, సాడి పద్మారెడ్డి, షరీఫ్, శశికళ, బిపిన్ కుమార్ జైన్, రామన్ పాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.


