నగరంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలు నిప్పుల కొలమిని తలపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికిభయపడుతున్నారు. వడగాలుల ధాటికి రహదారులన్నీ మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో, సామాన్యుడికి కాస్త ఉపశమనం కలిగించేది రోడ్డు పక్కన ఉండే చెట్ల నీడ మాత్రమే. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏయూ అవుట్ గేట్ వద్ద చెట్ల కొమ్మలను నరివేయడం గమనార్హం. ఒకవైపు ఎండలు మండుతుంటే, ఉన్న చెట్లను ఇలా నరికి వేయడం తగదని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


