ఉత్తమ టికెట్‌ తనిఖీ సిబ్బందికి సత్కారం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ టికెట్‌ తనిఖీ సిబ్బందికి సత్కారం

Apr 11 2026 9:52 AM | Updated on Apr 11 2026 9:52 AM

తాటిచెట్లపాలెం: వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ విభాగంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టికెట్‌ తనిఖీ సిబ్బందిని డీఆర్‌ఎం లలిత్‌బోహ్ర, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.పవన్‌కుమార్‌ సత్కరించారు. వాల్తేర్‌ డివిజన్‌ టికెట్‌ తనిఖీ సిబ్బంది ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిందని, టికెట్‌ తనిఖీల ద్వారా రూ.26.21 కోట్ల ఆదాయాన్ని సమకూర్చినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.05 శాతం వృద్ధి అని పేర్కొన్నారు. వీరిలో వై.అప్పలరాజు (టీటీఐ/విజయనగరం) ఉత్తమ ఫలితాలు సాధించిన జాబితాలో ముందున్నట్లు తెలిపారు. 850 కేసులు నమోదు చేయడం ద్వారా ఈయన 50.20 లక్షలు అపరాధ రుసుము వసూలు చేశారని, ఈయన తర్వాత కె.సంతోషిరావు, సంబిలి, పి.వి.త్రివిక్రమరావు టాపర్స్‌ జాబితాలో నిలిచారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement