వైఎస్సార్‌సీపీలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

అల్లిపురం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో విశాఖ జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక పదవులు వరించాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర స్థాయిలో..

పార్టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా లింగం శ్రీనివాస్‌ను, రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షుడిగా పారవాడ ఈశ్వరరావును, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా జీరు వెంకటరెడ్డిని, రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా తిప్పల అప్పలస్వామి రెడ్డిని, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా మహ్మద్‌ సబీర్‌ బేగంను నియమించారు. అలాగే పార్టీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా మార్దుపూడి పరదేశిని, ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా డా. సావల వెంకటేశ్వర్లు(వెంకట్‌)ను, పార్టీ బీసీ సెల్‌ కార్యదర్శులుగా మజిరెడ్డి చినరాజు నాయుడు, బడితబోయిన రాములప్పడును నియమించారు. పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శిగా వాడపల్లి రామచంద్రరాజును నియమించినట్లు వెల్లడించారు.

జిల్లా పార్టీ కమిటీలో..

పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అల్లా శేఖర్‌రావును, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వి.ప్రసాద్‌ను నియమించారు. అలాగే పార్టీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడిగా మనోజ్‌కుమార్‌ గోడబాను, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ అచ్యుత విజయ రామశేఖర్‌ను, జిల్లా మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా గొరు శ్రీనివాస్‌, సోషల్‌ మీడియా విభాగం కార్యదర్శిగా పాలకొండ చంద్రకాంత్‌, ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా నెలపాటి శ్యామ్‌బాబును నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా అంగన్‌వాడీ విభాగం కార్యవర్గ సభ్యురాలిగా ఉప్మాక సత్యవర లక్ష్మిని నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement