సింహగిరి ఘాట్‌రోడ్డులో కారు బోల్తా
సింహాచలం: సింహగిరి ఘాట్‌రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ సంక్రాంతి పండగ కోసం గాజువాకలోని తన ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి స్వామివారి దర్శనం కోసం సింహాచలం వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఘాట్‌రోడ్డు మార్గంలో కారు టైరు ఒక్కసారిగా పంచర్ కావడంతో వాహనం నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌తో పాటు కారులో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన దేవస్థానం సిబ్బంది వారిని అంబులెన్స్‌లో నగరంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.


