
ఒకే ఇంట్లో నలుగురికీ కిడ్నీ వ్యాధి
మా ఇంట్లో నలుగురం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. మా అమ్మ రాములమ్మ, నేను ఈ వ్యాధి కారణంగా మంచానపడ్డాం. నా తమ్ముడు శ్రీను, నా భార్య చినతల్లి కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్నారు. 15 ఏళ్ల కిందట నాకు కాళ్లు విరగడంతో ఆపరేషన్ కోసం కేజీహెచ్‌కు వెళ్లాను. అక్కడ చేసిన పరీక్షల్లో నా రెండు కిడ్నీలు పాడయ్యాయని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేస్తే ప్రాణహాని ఉంటుందన్నారు. అయినా నా బలవంతం మీద ఆపరేషన్ చేశారు. 15 ఏళ్ల నుంచి కిడ్నీ వ్యాధికి మందులు వాడుతున్నాను. ఇంటి నుంచి బయటకు నడిచి వెళ్లలేని స్థితిలో ఉన్నాను. ఏ పనీ చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాను. – కె. కృష్ణ, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు