గాజువాక: అన్నదాత సుఖీభవ మొదటి విడత సాయాన్ని జిల్లా రైతులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీవీరాంజనేయ స్వామి గాజువాకలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పథకం కింద వచ్చిన గ్రాంటుతో కలిపి మొత్తం రూ.20 వేల సాయాన్ని అందిస్తున్నామన్నారు. మొదటి విడత కింద జిల్లాలో 18,573 మంది రైతులు లబ్ధి పొందారన్నారు. ఈ పథకం కింద గాజువాక నియోజకవర్గంలో 577 మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అప్పలస్వామి, తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.