
స్థాయీ సంఘం ఎన్నికల బరిలో 20 మంది
అల్లిపురం: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు ఉన్నారని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థాయీ సంఘం ఎన్నికలకు 21 నామినేషన్లు దాఖలయ్యాయని, కార్పొరేటర్ మహమ్మద్ సాధిక్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవటంతో ఎన్నికల బరిలో 20 మంది సభ్యులు నిలిచారని పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీన స్థాయీ సంఘం ఎన్నికలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయన్నారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని కమిషనర్ తెలిపారు.