
విహారంలో విషాదం
● బ్రేక్‌లు ఫెయిలై కొండను ఢీకొన్న మినీ బస్సు ● 18 మందికి పర్యాటకులకు గాయాలు ● డ్రైవర్ పరిస్థితి విషమం
అనంతగిరి (సాక్షి, పాడేరు): మినీ బస్ బోల్తా పడి 18 మంది పర్యాటకులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. రాజమహేంద్రవరంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మంది మినీ బస్సులో అరకు పరిసర ప్రాంతాల సందర్శనకు సోమవారం రాత్రి బయలుదేరారు. మంగళవారం ఉదయం ఆరు గంటలకు అరకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను సందర్శించిన అనంతరం మధ్యాహ్నం బొర్రా గుహలు తిలకించి తిరుగు పయనమయ్యారు. సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో వాహనం ఘాట్ దిగుతుండగా శివలింగపురం పరిసరాలకు వచ్చేసరికి మినీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనం కొండను ఢీకొని బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న 21 మంది ప్రయాణికుల్లో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని తక్షణమే శృంగవరపుకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ కుమార్ స్వామి తీవ్ర గాయాలు కావడంతో విజయనగరం తరలించారు. మిగతా క్షతగాత్రులందరికి ప్రథమ చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. వారంతా రాజమహేంద్రవరం బయలుదేరారు. అనంతగిరి ఎస్‌ఐ శ్రీనివాసరావు శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విహారంలో విషాదం

విహారంలో విషాదం

విహారంలో విషాదం