
‘సాక్షి’ మీడియాపై కక్ష సాధింపు తగదు
సామాజికవేత్త, న్యాయవాది గుండుపల్లి సతీష్
బీచ్‌రోడ్డు: సమాజంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పేర్కొనే మీడియా సంస్థలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని సామాజికవేత్త, న్యాయవాది గుండుపల్లి సతీష్ అన్నారు. దీనిపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాజకీయాలు వేరు. పత్రికా స్వేచ్ఛ వేరు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పులేదు. ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును అధికారం అడ్డుపెట్టుకొని కాలరాయడం తగదు. నెలల తరబడి సాక్షి మీడియా ప్రసారాలను కేబుల్ టీవీలలో నిలిపివేయడం ప్రభుత్వ పక్షపాత ధోరణిగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో దీనిపై అనేక మంది నిరసన తెలుపుతున్నారు. కేబుల్ టీవీలతోపాటు ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో కూడా సాక్షి మీడియాను నిషేధించడం సమర్థనీయం కాదు’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, సాక్షి మీడియా ప్రసారాలు వెంటనే కేబుల్ టీవీల్లో ప్రసారం అయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.