
మార్కెట్‌లోకి వీవో ఎక్స్200ఎఫ్‌ఈ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫో
డాబాగార్డెన్స్: డాబాగార్డెన్స్‌లోని సెల్‌పాయింట్ షోరూంలో మంగళవారం వీవో ఎక్స్ 200ఎఫ్‌ఈ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌ను కోర్టు మూవీ ఫేమ్ శ్రీదేవి ఆవిష్కరించారు. సెల్‌పాయింట్ అధినేత మోహన్ ప్రసాద్ పాండే, ఎండీ బాలాజీ పాండే, దినేష్ పాండే, ఏఎస్‌ఎంలు వేంకటేష్, గోవింద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సినీ నటి శ్రీదేవి ఈ మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసి దాని ప్రత్యేకతలను వివరించారు. ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన ఈ ఫోన్ అద్భుతంగా ఉందని, బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుందని పేర్కొన్నారు. 50 ఎంపీ జెస్సీ కెమెరా, అత్యాధునిక ఫీచర్లతో యువతకు నచ్చే విధంగా ఉందన్నారు. ముఖ్యంగా రీల్స్ చేసేవారు ఈ మొబైల్ ద్వారా సులువుగా వీడియోలు తీసుకోవచ్చని తెలిపారు. ఈ మోడల్ రెండు వేరియంట్లలో.. 12జీబీ ర్యామ్, 256 జీబీ, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉందన్నారు. సెల్‌పాయింట్ ఎండీ బాలాజీ పాండే మాట్లాడుతూ విశాఖ తొలిసారిగా డైమండ్ పార్క్ వద్ద సెల్‌పాయింట్ ప్రారంభించామని, అంచెలంచెలుగా ఎదుగుతూ విశాఖలో 29 స్టోర్లు, రాష్ట్రవ్యాప్తంగా 82 సెల్‌పాయింట్ స్టోర్లకు విస్తరించామని చెప్పారు. వీవో ఏజీఎం ఎస్‌బీబీ సతీష్ కుమార్, ఏపీ సేల్స్ హెడ్ ఆజాద్, నాగవంశీ, సూర్య, బిలాల్, మనోహర్ పాల్గొన్నారు.