
పైపులైన్ లీకులుంటే సమాచారం ఇవ్వండి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ఎక్కడైనా తాగునీటి పైప్‌లైన్లు లీకైనా, మురుగు కాలువల్లో నీరు కలిసిపోవడాన్ని గమనించినా వెంటనే ఆయా జోనల్ కమిషనర్‌కు, వార్డు కార్యదర్శులకు, నీటి సరఫరా సహాయక ఇంజనీర్‌కు, సిటీ ఆపరేషన్ సెంటర్‌కు సమాచారం అందించాలని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నీటి పైప్‌లైన్ సమస్యలను తెలియజేయడానికి జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని కమిషనర్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 180042500009కు లేదా 0891– 2507225కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు ప్రతిరోజూ క్లోరిన్‌తో శుద్ధి చేసి, నాణ్యత పరీక్షించిన సురక్షిత తాగునీటినే సరఫరా చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో, ప్రజలు కూడా నీటి ద్వారా వ్యాపించే కలరా, డయేరియా వంటి వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.