పనుల్లో నాణ్యత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో నాణ్యత తప్పనిసరి

Nov 29 2026 11:41 AM | Updated on Nov 29 2026 11:41 AM

శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ సాత ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శనివారం పట్టణంలో రూ.8 లక్షలతో చేపడుతున్న కల్వర్టు మరమ్మతులను కమిషనర్‌ యోగేశ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీ కావాల్సిన నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. గుత్తేదారులు పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ జగదీశ్‌, కౌన్సిలర్‌ గణేశ్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌ సాత ప్రవీణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement