కొడంగల్ రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్) అండర్–14, 17 ఖోఖో జిల్లాస్థాయి క్రీడా పోటీలకు కొడంగల్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కే నగేష్ తెలిపారు. గురువారం పాఠశాల ఆవరణలో అండర్–17 విభాగం ఖోఖోలో ప్రథమ బహుమతి సాధించిన చంద్రకాంత్, శ్రీనిత్, బాలు, చరణ్‌తేజ్, వర్షిత్, అండర్ –14 విభాగంలో సత్తా చాటిన సాయికృష్ణ, వరిశేఖర్, నాగార్జున, రోహిత్, అండర్–17 విభాగం కబడ్డీలో నవీన్, రాజు, మహేష్, ప్రకాష్, అండర్–14 విభాగం కబడ్డీలో తనీష్, ఆంజనేయులు, వాలీబాల్ అండర్ –17 విభాగంలో శ్రీనిత్, రంజిత్, వాలీబాల్ అండర్ –14 విభాగంలో ధనుక్రిష్ ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.


