నిమజ్జనాలు ప్రశాంతంగా జరగాలి | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనాలు ప్రశాంతంగా జరగాలి

Sep 18 2026 8:18 AM | Updated on Sep 18 2026 8:18 AM

పరిగి: వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్‌ సూచించారు. గురువారం పట్టణంలో వినాయక మండపాల నిర్వాహకులు, అధికారులతో కలిసి పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని అన్నారు. ఉదయం శోభాయాత్రను ప్రారంభించి చీకటి పడేలోగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ కొండల్‌రెడ్డి, ఎస్సై మోహనకృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ రజిత, కమిషనర్‌ మల్లేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పార్థసారథి, తహసీల్దార్‌ వెంకటేశ్వరి, విద్యుత్‌, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.

డీఎస్పీ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement