ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగి, రాఘవాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో రెండో విడత ఇళ్లు వస్తాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నారని తెలిపారు.


