నేడు మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష

Apr 19 2026 1:44 PM | Updated on Apr 19 2026 1:44 PM

నేడు మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రైతు సంక్షేమమే ధ్యేయం సబ్సిడీ విత్తనాలు అందజేయాలి సమ్మె విరమించిన ఆర్టిజన్లు

తాండూరు రూరల్‌: తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని జినుగుర్తి మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు.. 7నుంచి 10వ తరగతిలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఎగ్జామ్‌ ప్యాడ్‌, హాల్‌ టికెట్‌, బాల్‌ పెన్‌, వాటర్‌ బాటిల్‌తో రావాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

పరిగి: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ సునీతా పద్మావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియాల్లో బీ కామ్‌(సీఏ), బీఎస్సీ గ్రూపులకు గాను విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అనంతగిరి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వికారాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని డీసీఎంఎస్‌ కార్యాలయ ఆవరణలో మార్క్‌ఫెడ్‌, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మల్లేశం, డీసీసీబీ డైరక్టర్‌ కిషన్‌నాయక్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ మేనేజర్‌ సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్‌ రాకేష్‌, నాయకులు శివయ్య, వేణుగోపాల్‌, సురేష్‌, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, మందులు అందజేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం వికారాబాద్‌లో సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సుదర్శన్‌, కార్యదర్శిగా మైపాల్‌, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్‌, నర్సింలు, వెంకట్రాం, సహ కార్యదర్శిఽనిగా నర్సమ్మ, మాణయ్య, నర్సింలు, కమిటీ సభ్యులుగా మోహన్‌, రాజు, కవిత, మల్లయ్య, జంగయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా కార్యదర్శి అనసూయ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులు సమ్మె విరమించారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో జరిగిన చర్చలు సానుకూలంగా ఉండటంతో సమ్మె విరమించినట్లు కార్మికులు తెలిపారు. శనివారం వికారాబాద్‌ డీఈ సంజీవరావును మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఆర్టిజన్‌ నాయకులు జైపాల్‌రెడ్డి, వెంకట్‌, సుభాన్‌, రామాంజనేయులు, శ్రీశైలం, అక్తర్‌ అలీ, బాలరాజు, బుచ్చిరెడ్డి, అశోక్‌, సురేష్‌, నర్సిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement