
‘మధ్యాహ్న భోజనం’ బంద్
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం తింసాన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు నిలిచిపోయింది. దీంతో స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి సుమారు యాభై రోజులుగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఈఓ రేణుకాదేవి శనివారం పాఠశాలను తనిఖీ చేశారు. కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం, బిల్లులు సరిగా రాకపోవడం, వంటి కారణాలతో ఏజెన్సీ నిర్వాహకులు భోజనం వండటం లేదు. గతంలోనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో డీఈఓ వారిని పిలిపించి భోజనం అందించా లని సూచించారు. బిల్లులు అందేలా తాను చూ స్తానని హామీ ఇచ్చారు. మరోసారి భోజనం పెట్టలే దని తెలిస్తే చర్యలు తప్పవని ఎంఈఓ నర్సింగ్‌రా వుతో పాటు ఉపాధ్యాయులను హెచ్చరించారు.
తింసాన్‌పల్లి పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ
ఏజెన్సీ నిర్వాహకులు, ఎంఈఓపై అసహనం
వెంటనే అమలు చేయాలని ఆదేశం