
సమాజహితం కోరి..
ఆమనగల్లు: ఆమనగల్లు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 1994 – 95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులందరూ ‘స్నేహ హస్తం’ పేరిట సమాజ సేవ చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో స్నేహ హస్తం ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ సీఐగా పనిచేస్తున్న గజ్జె చరమందరాజు, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ కొనసాగుతోంది. అనారోగ్యానికి గురైన బాల్య మిత్రులకు అండగా నిలుస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు.