
దోస్త్
మేరా
దోస్త్
పాతికేళ్ల ప్రయాణం
శంకర్‌పల్లి: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎస్.ఇటిక్యాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్, వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులుమామిడికి చెందిన రవి కుమార్ శెట్టి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరిదీ వేర్వేరు జిల్లాలైనా 2001లో సంగారెడ్డిలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ శంకర్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. రవికుమార్ మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామ సెక్రెటరీగా పని చేస్తున్నారు. వీరి పాతికేళ్ల ప్రయాణంలో నిత్యం మాట్లాడుకోని రోజంటూ ఉండదు. మా స్నేహానికి హద్దులు ఉండవని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కష్టసుఖాల్లో కలిసే సాగుతామని పేర్కొన్నారు.
సృష్టిలో వెలకట్టలేనిది స్నేహం
చెప్పలేనంత ప్రేమ
దుద్యాల్: మండలంలోని హస్నాబాద్‌కు చెందిన ప్రభాకర్(బాహుబలి చిత్రంలో కాళకేయ పాత్రలో నటించిన వ్యక్తి) సినీ రంగంలో స్థిరపడ్డారు. వినోద్ కుమార్(నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి). ఇద్దరికీ చిన్ననాటి స్నేహితులంటే చెప్పలేనంత ప్రేమ. వారితోపాటు పాఠశాలలో చదువుకున్న మిత్రులను ఆప్యాయంగా పలకరిస్తారు. ఉన్నత స్థానంలో ఉన్నా ఎక్కడా వారి గొప్పతనాన్ని ప్రదర్శించరు. ఎప్పటిలాగే బాల్య మిత్రులతో సరదాగా గడుపుతారు. వీరు గ్రామానికి వచ్చిన ప్రతి సారీ స్థానికులు, స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. ఫ్రెండ్‌షిప్‌కు వీరిచ్చే నిర్వచనమే వేరు..

దోస్త్