
మేమున్నామని..
ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1983– 84 పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్లుగా చెక్కు చెదరని స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకుంటూ మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. తాము చదువుకున్న పాఠశాలకు ఇటీవల రూ.1.50 లక్షల విలువైన బెంచీలు, బీరువా తదితర సామగ్రిని అందజేశారు. మహిళా దినోత్సవం, ఫ్రెండ్‌షిప్ రోజున ఒక్కచోటకు చేరి పాత జ్ఞాపకాలను నెరమువేసుకుంటున్నారు. వృద్ధాప్యం ముంచుకువస్తున్నా తరచూ కలుస్తూ స్నేహనికి కన్న మిన్న లోకాన లేదురా అని చాటిచెబుతున్నారు.