
40 ఏళ్ల బంధం
తాండూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన శ్రీదేవి, లలిత మంచి స్నేహితులు. బాల్యమంతా కడపలోనే చదువుకున్నారు. 6వ తరగతి నుంచే మంచి ఫ్రెండ్స్. వివాహ అనంతరం శ్రీదేవి తెలంగాణాలో.. లలిత కర్ణాటకలో స్థిరపడ్డారు. ప్రస్తుతం శ్రీదేవి తాండూరు మండలం జినుగుర్తి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. లలిత బెంగళూరులోని నారాయణ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. 40 ఏళ్లుగా వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఏదైనా శుభకార్యం జరిగినా, పండుగలు, వేసవి సెలవులు వచ్చినా కలుస్తారు. కుటుంబ సభ్యులతో సరదగా గడుపుతుంటారు. ప్రపంచంలో వెల కట్టలేనిది స్నేహం మాత్రమే అని శ్రీదేవి తెలిపారు.