
ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు
మాది నల్లగొండ జిల్లా మారుమూల కుగ్రామం.. మా గ్రామంలో 3వ తరగతి వరకే ఉండేది.. పదో తరగతి వరకు పక్క గ్రామంలో చదివా.. నాలుగు కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవాళ్లం. వర్షం పడితే స్కూల్ మార్గంలోని వాగు పారేది.. దీంతో డుమ్మా కొట్టేవా ళ్లం. ఆ సమయంలో స్నేహితులతో కలిసి ఆడుకునే వాళ్లం.. కలిసి చదువుకునే వాళ్లం.. రోజూ ఆడుతూ పాడుతూ స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్లే స్నేహితులను ఇప్పటికీ మరచిపోలేను.. చాలా మంది మిత్రులు ఉన్నారు.. ఒకరిద్దరి పేర్లు చెబతే మిగతా వాళ్లను తక్కువ చేసినట్లవుతుంది. ఏది ఏమైనా చిన్ననాడు ఫ్రెండ్స్‌తో గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను..
– లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్