
పనుల్లో వేగం పెంచండి
కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్య మన్నారు. సొంత ఇల్లు ఉంటే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లాకు ఇప్పటివరకు 11,785 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. 5,778 గ్రౌండింగ్ అయ్యాయని, 882 పూర్తయినట్లు పేర్కొన్నారు.
హౌసింగ్ పీడీకి ఘన వీడ్కోలు
ఉద్యోగ విరమణ పొందుతున్న హౌసింగ్ శాఖ పీడీ కృష్ణయ్యకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కృష్ణయ్య సేవలను కలెక్టర్ కొనియాడారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటే హౌసింగ్ స్కీంను ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, హౌసింగ్ శాఖ అధికారులు ముక్రం బాబా, సయ్యద్ సాజిద్, తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేసిన సేవలే గుర్తుండిపోతాయి
విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్న హోసింగ్ పీడీ కృష్ణయ్యకు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, టీజీఓ సెక్రటరీ మహమ్మద్ సత్తార్, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.