శ్రీవారి వైద్య సేవలో ప్రముఖ వైద్య నిపుణులు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి వైద్య సేవలో ప్రముఖ వైద్య నిపుణులు

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

తిరుపతి తుడా: టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్‌ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీవారి వైద్య సేవలో భాగంగా ప్రముఖ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్‌ సందీప్‌ కొడాలి ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఈ సేవల్లో భాగంగా ఆయన స్విమ్స్‌ ఓపీ విభాగానికి వచ్చిన రోగులతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లను కూడా పరిశీలించారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి వ్యాధుల నిర్ధారణ, అవసరమైన చికిత్సలు, వైద్య సలహాలు, తదుపరి చికిత్సా విధానాలపై తగిన సూచనలు అందించారు. అనంతరం వైద్య విద్యార్థులకు చర్మవ్యాధులపై ప్రత్యేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ మాట్లాడుతూ పేదలకు అత్యున్నత వైద్య నైపుణ్యంతో కూడిన నాణ్యమైన వైద్యం అందించడమే స్విమ్స్‌ లక్ష్యమని తెలిపారు. శ్రీవారి వైద్య సేవలో భాగంగా ప్రముఖ వైద్య నిపుణుల అనుభవం, సేవలను సామాన్య ప్రజలకు చేరువ చేస్తున్నామని చెప్పారు. నిరుపేదలకు అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన చికిత్స అందించడమే శ్రీవారి వైద్య సేవ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

బంగారు తిరుచ్చిపై

సీతారాముల కటాక్షం

చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న సీతారాముల వారు శనివారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మనక్షత్రమైన పునర్వుసు సందర్భంగా ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సర్వాలంకర శోభితుడైన స్వామివారు శ్రీసీతాలక్ష్మణ సమేతంగా బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధుల్లో ఊరేగారు. అదే విధంగా చంద్రగిరిలో కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక కల్యాణోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వరక్ష్మీ, ఏఈవో గోపీనాథ్‌, సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ మునికుమార్‌, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ఽ ధనశేఖర్‌ పాల్గొన్నారు.

అసిస్టెంట్‌ మెకానిక్‌లకు ఆహ్వానం

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : తిరుపతి ఆర్టీసీ డిపో గ్యారేజ్‌లో అసిస్టెంట్‌ మెకానిక్‌గా పనిచేసేందుకు అర్హత కలిగిన ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్‌ శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌, డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌ ట్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. బస్సుల మరమ్మతుల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి అవకాశాలు ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ఐటీఐ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ కాపీలతో డిపో మేనేజర్‌, ఆర్టీసీ తిరుపతి డిపో వారిని సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు గ్యారేజ్‌ ఇన్‌చార్జ్‌ 7382874647, డిపో మేనేజర్‌ 9959225670లో సంప్రదించాలని పేర్కొన్నారు.

స్కేటింగ్‌లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ప్రతిభ

తిరుపతి సిటీ: కాకినాడ వేదికగా ఇటీవల జరిగిన 38వ అంతర్‌ జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2026లో పద్మావతి జూనియర్‌ కళాశాలలకు చెందిన హెచ్‌ఈసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని వై.నవ్యశ్రీ రెడ్డి విజేతగా నిలిచి మూడు పథకాలను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.భువనేశ్వరి విద్యార్థినిని అభినందించారు. అకడమిక్‌ విద్యతో పాటు క్రీడలపై దృషి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీ సాయి సుమతి, అధ్యాపకులు పాల్గొని నవ్యశ్రీని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement