ఎన్నికల సిబ్బంది ఆకలికేకలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిబ్బంది ఆకలికేకలు

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

తడ: జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల కోసం తడ మండల సిబ్బంది శనివారం సిద్ధమయ్యారు. ఇందుకోసం తడ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మధ్యాహ్నానికి ఎన్నికల సామగ్రిని తీసుకున్నారు. భోజనాల అనంతరం తమకు కేటాయించిన స్థానాలకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. సిబ్బందికి మధ్యాహ్నం రెండు గంటలైనా భోజనాలు రాకపోవడంతో అసహనంతో వేచి చూశారు. ఇంతలో భోజనాలు రావడంతో అక్కడికి సుమారు 420 మంది సిబ్బంది చేరుకున్నారు. అయితే కేవలం 150 మందికి సరిపడే భోజనాలే రావడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు. దీనిపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో 3 గంటల సమయానికి మరో 20, 30 మందికి మాత్రమే సరిపోయే భోజనాలు సమకూర్చారు. అప్పటికే ఆకలితో ఉన్న సిబ్బంది ఖాళీ ప్లేట్లు చేతబట్టుకుని అన్నంకోసం ఎగబడ్డారు. అదికూడా చాలకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన సిబ్బంది విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి ఎక్కడ ఆహారం లభిస్తుందో తెలియని పరిస్థితి ఒక వైపు, ఎన్నికల సామగ్రి తీసుకున్న తరువారం వాటిని ఎక్కడ పెట్టి భోజనాలకు వెళ్లాలో తెలియని అయోమయం మరో వైపు నెలకొనడంతో సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. షుగర్‌, బీపీ వంటి సమస్యలతో ఉన్న సిబ్బంది మరింత ఇబ్బందికి గురయ్యారు. ఎంపీడీసీ ఎన్నికల సమయంలోనూ దూర ప్రాంతాల్లోని పోలింగ్‌ స్టేషన్లకు వెళ్లే వారికి వాహనాలు ఏర్పాటు చెయ్యక పోవడంతో సిబ్బంది అప్పట్లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement