వందే గోమాతరం పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

వందే గోమాతరం పోస్టర్‌ ఆవిష్కరణ

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జూలై 10వ తేదీన పదివేల మందితో వందే గోమాతరం–2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం వీసీ ప్రొఫెసర్‌ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు వందే గోమాతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారు మట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే భారీ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఆర్కే గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ 7799884561, విశ్వం సైనిక్‌ స్కూల్‌ 7013563928ను సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్‌ వెంకట నారాయణరావు, అంతర్జాతీయ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రధాన కో–ఆర్డినేటర్‌ ఆర్కే విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ టి రామకృష్ణారెడ్డి, విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్‌ ఎన్‌.విశ్వచందన్‌రెడ్డి, అన్నమయ్య డ్యాన్స్‌ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీరామ్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement