– గాయపడిన విద్యార్థినికి అండగా ఎంపీ గురుమూర్తి
వరదయ్యపాలెం: రోడ్డు ప్రమాదంలో గాయపడి కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆర్.తేజస్వినికి సీటు దక్కేలా ఎంపీ మద్దిల గురుమూర్తి చొరవ తీసుకున్నారు. ఆర్‌జీయూకేటి ఛాన్స్‌లర్‌కు లేఖ రాసి మానవతా దృక్పథం చాటుకున్నారు. సత్యవేడు మండలం, మదనపాళెం గ్రామానికి చెందిన తేజస్విని పదో తరగతిలో 573 మార్కులు సాధించి ఆర్‌జీయుకేటీ ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించింది. జూన్ 22న ఇడుపులపాయలో కౌన్సెలింగ్‌కు వెళ్తుండగా తిరుపతి జిల్లా రాజంపేట సమీపంలోని పుల్లంపేట వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తేజస్విని రెండు వేళ్లు కోల్పోయింది. తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి కళాశాల ఛాన్స్‌లర్, ఏపీఎస్‌సీ హెచ్‌ఈ చైర్మన్ ప్రొ.కె.మధుమూర్తికి లేఖ రాశారు. కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయినా అడ్మిషన్‌కు అనుమతించాలని లేఖలో కోరారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


