తిరుమల: తిరుమలలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే దిశగా బుధవారం అక్టోపస్ ప్రత్యేక బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. యాత్రికుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసా లు చేపట్టారు. జీఎంఎల్ యాత్రికుల వసతి సముదా యం వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్‌లో కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డట్లు ఊహించి, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్టోపస్ బృందాలు, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మాక్ డ్రిల్‌లో తిరుమల పోలీసులు, అక్టోపస్ బృందాలు, టీటీడీ విజిలెన్స్ విభాగం, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.


