అటానమస్‌ హోదాలో సీకాం డిగ్రీ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

అటానమస్‌ హోదాలో సీకాం డిగ్రీ ఫలితాలు విడుదల

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

తిరుపతి సిటీ: సీకాం డిగ్రీ కళాశాలల అటానమస్‌ హోదాలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ సెకండ్‌ సెమిస్టర్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఎస్వీయూలో వీసీ ప్రొఫెసర్‌ నర్సింగరావు, సీకాం విద్యాసంస్థల డాక్టర్‌ టి సురేంద్రనాథరెడ్డి, రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీకాం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ మునిరాజ్‌ మాట్లాడుతూ.. డిగ్రీ సెకండ్‌ సెమిస్టర్‌లో సీకాం విద్యార్థులు రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించారన్నారు. ఫలితాలలో అన్ని డిగ్రీ కోర్సులలో 90శాతం ఉత్తీర్ణత సాధించామని చెప్పారు. బీకాం సీఏ విద్యార్థిని ప్రవళిక 9.56 సీజీపీఏ సాధించగా, బీకాం బీ అండ్‌ ఎఫ్‌ కోర్సులో రాఘవిశ్రీ 9.72, బీసీఏ డీఎస్‌లో జితశ్రీ 9.50, బీసీఏ ఏఐలో జ్యోతి 9.53, బీబీఏలో సాహితి 9.50, బీఎస్సీ సీఎస్‌లో పూజిత 9.48సీజీపీఏ సాధించడం సంస్థకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో అకడమిక్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ప్రొఫెసర్‌ సుమా కిరణ్‌, గవర్నింగ్‌ బాడీ మెంబర్‌ ప్రొఫెసర్‌ మోహర్‌రెడ్డి, సీకాం డైరెక్టర్లు టి తేజస్వరూప్‌, టి ప్రణీత్‌ స్వరూప్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement