● జ్యోతిర్లింగంతో కూడిన దివ్యదక్షిణయాత్ర ( ఎస్‌సీజడ్‌బీజీ–63): (అరుణాచలం, చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి) ఈ యాత్ర జులై 20వ తేదీన ప్రారంభమై 28వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.15,600 నిర్ణయించారు. ఈ యాత్ర సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా సాగనుంది.
● అయోధ్య –కాశీ–వైద్యనాథ్ దర్శన యాత్ర (ఎస్‌సీజడ్‌బీజీ –62): గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్, వైద్యనాథ్ థామ్ వరకు కాగా ఈ యాత్ర జులై 4వ తేదీన ప్రారంభమై జులై 13వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,400 నిర్ణయించారు. ఈ యాత్ర సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా సాగనుంది.
● అయోధ్య–కాళి: పుణ్య క్షేత్ర యాత్ర (ఎస్‌సీజడ్‌బీజీ –64): పూరి కోణార్క్ గయా వారణాసి అయోధ్య– ప్రయాగరాజ్. ఈ యాత్ర ఆగస్టు 4వ తేదీన ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,500 నిర్ణయించారు.
తిరుపతి అన్నమయ్యసర్కిల్: యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీలో 3 ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తిరుపతి ఏరియా ఐఆర్‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సోమశేఖర్ నాయుడు వెల్లడించారు. బుధవారం ఆయన స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణతో కలసి ప్యాకేజీ టూర్ బ్రోచర్‌ను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు.
సౌకర్యాలు: ప్రతి రైలు లో 705 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినెటర్లు అందుబాటులో ఉంటారు. రైలు, బస్సు, హోటల్ అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం , రాత్రి భోజనం), తాగునీరు ఉచితం. ప్రతి కోచ్‌కు ఒక సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 9281495853, 8287932313 నంబర్లను సంప్రదించాలని చెప్పారు. దీంతోపాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో ఏరియా మేనేజర్ ఎస్. అశోక్ కుమార్ టూరిజం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.