లీకేజీ కుంగదీసింది | - | Sakshi
Sakshi News home page

లీకేజీ కుంగదీసింది

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

మే 3న జరిగిన నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్‌ కావడంతో బాగా రాసిన విద్యార్థులు మానసికంగా కుమిలిపోయారు. దాని ప్రభావం రీ నీట్‌పై స్పష్టంగా కనిపించింది. రీ టెస్ట్‌ రాసిన విద్యార్థులు సంతోషంగా లేరు. కటాఫ్‌ మార్కులు వస్తేగానీ సీటు వస్తుందనే విషయంపై క్లారిటీ రాదు. –ప్రకాష్‌, నీట్‌ విద్యార్థి తండ్రి, తిరుపతి

రీ నీట్‌పై ప్రభావం చూపింది

నీట్‌ లీకేజీ వ్యవహరం రీ నీట్‌పై పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. మే 3న నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థులు మంచి ర్యాంక్‌ సాధించినా.. రీ నీట్‌లో మెరిట్‌ స్టూడెంట్‌ సైతం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులను నీట్‌ పరీక్ష వేదనతో పాటు ఒత్తిడికి గురిచేసింది. – అనుపమ, విద్యార్థిని తల్లి, తిరుపతి

క్లిష్టంగా అనిపించాయి

రీ నీట్‌ ప్రశ్నపత్రం కాస్త క్లిష్టంగా ఉందనే చెప్పాలి. బయాలజీ, కెమిస్ట్రీ చాలా సులువుగా ప్రశ్నలు ఇచ్చారు. గతంలో జరిగిన నీట్‌ పరీక్ష బాగా రాశా. రీ నీట్‌ పరీక్ష ఫలితాలు, కటాఫ్‌ మార్కులు తెలిస్తే సీటు విషయం చెప్పగలం. – తల్లి నాగమణితో విద్యార్థిని హాసిని, తిరుపతి

చాలా కష్టమనిపించింది

రీ నీట్‌ పేపర్‌ కిష్టంగా ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో లెంతీ ప్రశ్నలు అడగడంతో టైమ్‌ వృథా అయ్యింది. మేలో జరిగిన పరీక్షతో పోలిస్తే రీ నీట్‌ పేపర్‌ కఠినంగా ఉంది. మంచి ర్యాంక్‌ కోసం చాలా కష్టపడ్డా.

– తండ్రి మహ్మద్‌ రఫీతో విద్యార్థి రౌనఖ్‌, మదనపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement